బీఆర్ఎస్​లో చేరితే సముచిత స్థానం కల్పిస్తాం.. పొన్నాలకు కేసీఆర్ హామీ

బీఆర్ఎస్​లో చేరితే సముచిత స్థానం కల్పిస్తాం.. పొన్నాలకు కేసీఆర్ హామీ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​లో చేరితే సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని సీనియర్ లీడర్ పొన్నాల లక్ష్మయ్యకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్​కు చేరుకున్న పొన్నాల లక్ష్మయ్య దంపతులను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. 

ఇద్దరి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్​లో చేరాలని ఈ సందర్భంగా పొన్నాల లక్ష్మయ్యను కేసీఆర్ కోరారు. తగిన గుర్తింపు ఇస్తామని సూచించారు. దీనికి పొన్నాల లక్ష్మయ్య కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ ​నేత దాసోజు శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.