రేవంత్ వల్లే కాంగ్రెస్ భ్రష్టు పట్టింది.. కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటా

రేవంత్ వల్లే కాంగ్రెస్ భ్రష్టు పట్టింది.. కేసీఆర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటా

రేవంత్ రెడ్డి వల్లే కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిందన్నారు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య. జనగామలో తాను ఓడిపోయానని వ్యాఖ్యానిస్తున్న రేవంత్ రెడ్డి..కొడంగల్లో ఎందుకు ఓడిపోయారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాతే కొడంగల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు..ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య కోదాడలో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండలో ఓడిపోలేదా అని నిలదీశారు. 

మంత్రి కేటీఆర్ తనను బీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించినట్లు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కేసీఆర్ కూడా బీఆర్ఎస్లోకి రావాలని కోరినట్లు చెప్పారు. అక్టోబర్ 15వ తేదీన కేసీఆర్తో సమావేశమవుతానని స్పష్టం చేశారు. అనంతరం నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. 

తనను తీవ్రంగా అవమానించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు వచ్చారని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. తాను ఎప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాననో ప్రజలకు తెలియదా అని అడిగారు. అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకుంటే అంతకుమించి బుద్ది తక్కువ పని ఎవరు చేయరన్నారు. ఐకమత్యమే పార్టీ బలం అని..ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి  మరిచిపోయారని మండిపడ్డారు. రాజకీయాల్లో పదవులు కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్ కోసం అని స్పష్టం చేశారు. కానీ నియంతలా వ్యవహరించడం కోసం మాత్రం కాదన్నారు. 
 

ALSO READ : హద్దు మీరితే చర్యలు తప్పవు.. విజయ్ ఫ్యాన్స్కు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్