రాజీవ్ రహదారిని 8 లేన్లు చేయండి : పొన్నం ప్రభాకర్

 రాజీవ్ రహదారిని 8 లేన్లు చేయండి : పొన్నం ప్రభాకర్
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర మంత్రి పొన్నం లేఖ
  • ఐఐటీఎంఎస్, ఐడీటీఆర్​కు నిధులు ఇవ్వాలని వినతి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా రామగుండం వరకు వెళ్లే రాజీవ్ రహదారిని ఎనిమిది లేన్ల రోడ్డుగా మార్చాలని కేంద్ర జాతీయ రహదారులు రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. 

ఈ మేరకు సోమవారం గడ్కరీకి ఆయన లేఖ రాశారు. ఈ రోడ్డు విస్తరణ వల్ల మా ప్రాంతం సామాజిక, -ఆర్థిక అభివృద్ధికి, లక్షల మంది ప్రయాణికుల భద్రత, సౌలభ్యం కోసం ఉపయోగపడుతుందని అందులో పేర్కొన్నారు. తెలంగాణలోని రవాణా ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్‌‌పోర్ట్ మేనేజ్‌‌మెంట్ సిస్టమ్ ( ఐఐటీఎంఎస్),  వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు అమలు చేస్తున్నామని పొన్నం లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో మరో ఇంటిగ్రేటెడ్ డ్రైవింగ్, ట్రైనింగ్ రిసెర్చ్ (ఐడీటీఆర్)ను ఏర్పాటు చేయడానికి అనుమతిని ఇవ్వాలని కోరారు.