సమగ్ర సర్వే రిపోర్ట్ను ఎందుకు బయటపెట్టలేదు: పొన్నం ప్రభాకర్

సమగ్ర సర్వే రిపోర్ట్ను ఎందుకు బయటపెట్టలేదు: పొన్నం ప్రభాకర్

కులగణన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని.. కులగణన తీర్మానానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలని.. రాహుల్ గాంధీకి ఆశయాలకు అనుగునంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. 

తాము ఇచ్చిన హామీ ప్రకారం చిత్తశుద్ది చాటుకున్నామని తెలిపారు. బీఆర్ఎస్ సమగ్ర సర్వే రిపోర్ట్ ను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. పదేళ్లు బీసీలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించారు.  అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణనపై మాట్లాడిన మాజీ మంత్రి గంగుల కమలాకర్.. సర్వే రిపోర్ట్ బయట పెట్టాలని బీఆర్ఎస్ ను ఎందుకు నిలదీయలేదన్నారు. 

కులగణన తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఆమోదం నిన్న (ఫిబ్రవరి 16) తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన, సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వేకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రమంతా సామాజిక, ఆర్థిక ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించామని ఆయన తెలిపారు.