
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ను కరోనా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇద్దరు ప్లేయర్లు సహా ఆరుగురు ఢిల్లీ మెంబర్స్ కరోనా బారిన పడగా.. తాజాగా ఆ టీమ్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఐసోలేషన్‌కు వెళ్లాడు. తన ఫ్యామిలీలో ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో పాంటింగ్ ఐదు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని శుక్రవారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ వెల్లడించింది. అయితే పాంటింగ్‌కు రెండుసార్లు టెస్టు చేయగా నెగెటివ్ రిజల్ట్ వచ్చిందని తెలిపింది. కానీ, కరోనా వచ్చిన వాళ్లకు తను క్లోజ్ కాంటాక్ట్ కావడంతో ఢిల్లీ మేనేజ్‌మెంట్, మెడికల్ టీమ్ పాంటింగ్‌ను ఐసోలేషన్‌లో ఉంచాలని నిర్ణయించింది.