‘లవ్ యు మోనిక’.. ‘కూలీ’ సినిమా నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్

‘లవ్ యు మోనిక’.. ‘కూలీ’ సినిమా నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్

సక్సెస్‌, ఫెయిల్యూర్స్​తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళుతోంది పూజాహెగ్డే. ఈ ఏడాది ఇప్పటికే హిందీలో ‘దేవ’, తమిళంలో ‘రెట్రో’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె.. ఆగస్టులో ‘కూలీ’ సినిమాతో అలరించబోతోంది.  రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె స్పెషల్‌ అప్పియరెన్స్ ఇస్తోంది. ఫిబ్రవరిలోనే ఈ విషయాన్ని రివీల్ చేసిన మేకర్స్‌.. ఇప్పుడా పాటను విడుదల చేస్తున్నారు. ‘మోనిక.. లవ్‌ యు మోనిక’ అంటూ సాగే ఈ సాంగ్‌ ప్రోమోను బుధవారం విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం ఫుల్‌ సాంగ్‌ రాబోతోందని తెలియజేశారు.

పోర్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన ఈ మాస్‌ బీట్‌ సాంగ్‌లో రెడ్ కలర్ కాస్ట్యూమ్స్​లో ఆకట్టుకున్న పూజా.. మోనిక ఫీవర్ బిగిన్‌ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్, సౌబిన్ షాహిర్‌‌ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.  ఆగస్టు 14న విడుదల కానుంది. మరోవైపు విజయ్‌తో ‘జననాయగన్‌’, లారెన్స్​తో ‘కాంచన 4,  వరుణ్ ధావన్‌కు జంటగా ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ చిత్రాల్లో పూజాహెగ్డే నటిస్తోంది.