డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో నాణ్యత లోపం

డబుల్ బెడ్రూమ్ ఇండ్లల్లో నాణ్యత లోపం

చండ్రుగొండ,వెలుగు: మండలంలోని మద్దుకూరు గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాసిరకంగా నిర్మించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్లాబ్  నుంచి నీళ్లు కారి నిలుస్తున్నాయి.  రూ.1.50 కోట్లతో 30 ఇండ్లు నిర్మించారు. ఏడాది నుంచే లబ్ధిదారులకు ఇండ్లలో ఉంటున్నారు. ఈ నెల 7న వీటిని ఎంపీ నామా నాగేశ్వరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు, ఎమ్మెల్సీ తాతా మధు ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే లబ్ధిదారులు ఇండ్లు ఉరుస్తున్నాయని ఎంపీ, ఎమ్మెల్యేలకు కంప్లైట్ చేశారు. రిపేర్లు చేయిస్తామని లబ్ధిదారులకు చెప్పి రిబ్బన్ కట్ చేసి వెళ్లారు. వర్షాలు కురుస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. జోరు వానలు కురిస్తే స్లాబు ఊడి పెచ్చులు రాలుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఐటీడీఏ ఏఈ సుబ్బరాజును వివరణ కోరగా కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వెంటనే రిపేర్లు చేయిస్తామని చెప్పారు.