
వాలింటీర్లపై పవన్ వ్యాఖ్యలపై నటుడు, డైరెక్టర్ పోసాని మురళి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ఇప్పటికైనా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాలింటీర్లపై పవన్ అసభ్యంగా మాట్లాడారని.. వాలింటీర్ల వ్యవస్థ చాలా గొప్పదన్నారు. వాళ్లను తిడితే వాళ్ల కుటుంబ సభ్యులు బాధపడరా అని ప్రశ్నించారు. పవన్ ఇప్పటికైనా తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలన్నారు
భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమికి టీడీపీనే కారణమన్నారు పోసాని. పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి టీడీపీ రూ.15 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థల అధినేతలు దుర్మార్గులైన చంద్రబాబు గుప్పిట్లో ఉన్నారని.. వారంతా పవన్ ను వాడుకొని కరివేపాకులా పడేస్తారన్నారు. చంద్రబాబు ఏది చెబితే అదే పవన్ కళ్యాణ్ మట్లాడుతారన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు గుప్పిట్లో ఉన్నారన్నారు. టీడీపీ హయాంలో ప్రజల డేటాను సేకరించినపుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు.