
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై డైరెక్టర్ పోసాని మురళీ కృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. వెన్నుపోటు పొడిచే బుద్ధి.. ఆ పేటెంట్ హక్కులు చంద్రబాబుకే ఉన్నాయన్నారు. చంద్రబాబుకు కులపిచ్చి ఉందనీ, కులగజ్జి ఉందని ఆరోపించారు. ఎవరు మాత్రం ఎస్సీల్లో పుట్టాలని కోరుకుంటారు..అందరూ సంపన్న వర్గాల్లోనే పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు అనలేదా అని పోసాని అన్నారు. ఎస్టీ కులంలో దళితులుగా పుట్టినవారు మనుషులు కాదా? కమ్మ కులంలో పుట్టినవాడే మనిషా? నువ్వు కమ్మవాడివి కాబట్టి అగ్రవర్ణం వాడివా? అని ప్రశ్నించారు. కర్మతో ఎవడైనా వెధవ అవుతాడు తప్ప కులంతో అవ్వడనే స్పృహ కూడా చంద్రబాబు లేదా? అని పోసాని విమర్శించారు.