ఉప్పల్ ఫ్లై ఓవర్ పనుల ఆలస్యానికి రాష్ట్ర సర్కారే కారణం!

ఉప్పల్ ఫ్లై ఓవర్ పనుల ఆలస్యానికి రాష్ట్ర సర్కారే కారణం!
  • పేపర్ క్లిప్​ను పిల్లర్లపై అంటించిన బీజేపీ నేతలు
  • కొనసాగుతోన్న వివాదం

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్, అంబర్​పేట ఫ్లై ఓవర్ ఆలస్యంపై వివాదం కొనసాగుతోంది. ఫ్లై ఓవర్ పనులు ఆలస్యం కావడానికి కారణం నేషనల్ హైవేస్ వింగ్ అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఇటీవల సమాధానమిచ్చారు. దీంతో ఫ్లై ఓవర్ పిల్లర్లపై అధికార బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టర్లు అంటించారు. వీటికి కౌంటర్​గా ఫ్లై ఓవర్ పనుల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే అంటూ ఓ ఇంగ్లీష్ పేపర్​లో వచ్చిన క్లిప్​ను బుధవారం బీజేపీ కార్యకర్తలు పిల్లర్లపై అంటించారు.

ఈ రెండు ఫ్లై ఓవర్ పనులు స్టేట్ ఆర్ అండ్ బీ పరిధిలో ఉన్న నేషనల్ హైవేస్ వింగ్ చేపడుతోందని ఆ వార్త క్లిప్​లో పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ఈ పనులు లేట్ అవడానికి గల కారణాలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లెటర్లను ఆ వార్తలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తూ దాన్ని కేంద్రంపై తోస్తోందని పలువురు నెటిజన్లు ట్విట్టర్​లో కేటీఆర్​కు సమాధానమిచ్చారు.