పాలిటెక్నిక్ లెక్చరర్స్, పీడీ ఎగ్జామ్స్ వాయిదా.. టీఎస్​పీఎస్సీ ప్రకటన

పాలిటెక్నిక్ లెక్చరర్స్, పీడీ ఎగ్జామ్స్ వాయిదా.. టీఎస్​పీఎస్సీ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్​లో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన ఎగ్జామ్స్​ను టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలిటెక్నిక్​ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల కు ఈ నెల 13 నుంచి పరీక్షలు నిర్వ హించాల్సి ఉండగా సెప్టెంబర్​కు వాయిదా వేసింది. 

సెప్టెంబర్ 4,5,6,8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 4 రోజుల పాటు సబ్జెక్టు ల వారీగా ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయని పేర్కొంది. ఇక ఈ నెల 17న నిర్వహించాల్సిన పీడీ​ పోస్టుల ఎగ్జామ్​ను సెప్టెం బర్​ 11కు వాయిదా వేసింది. ఈ పరీక్షలన్నింటినీ ఆన్​లైన్​లోనే నిర్వహించనున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది.