
న్యూఢిల్లీ, వెలుగు: కరోనా, డెంగీ వంటి ప్రాణాంతక వ్యాధులకు జనరిక్ మందులతో ర్యాపిడ్‌గా ట్రీట్మెంట్ ఇచ్చి నయం చేయొచ్చని సుల్తాన్ బజార్ యూపీహెచ్సీ(అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్)కు చెందిన డాక్టర్ వసంత్ కుమార్ తెలిపారు. కేవలం రూ. 45 ఖరీదు చేసే అల్లోపతి మందులతో నాలుగు రోజుల్లోనే కరోనా, రూ. 450తో వారం రోజుల్లోపు డెంగీని తగ్గించవచ్చని వెల్లడించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ)లో మీడియాతో మాట్లాడారు.
వందలాది మందికి కరోనా ట్రీట్ మెంట్ ఇచ్చి నయం చేసినట్లు చెప్పారు. ఈ మందుల డీటెయిల్స్, ట్రీట్ మెంట్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వానికి సమర్పిస్తే పట్టించుకోలేదని వసంత్ కుమార్ ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ మూడు రోజుల నిరాహార దీక్ష చేయగా, పోలీసులు తనను అరెస్టు చేసి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆకుపసర్లు వంటి చికిత్సకు ప్రాధాన్యం ఇస్తున్న ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)ను ఆశ్రయించినట్లు చెప్పారు.