పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచడానికి కోడి పిల్లల పెంపకం

పిల్లలను ఫోన్లకు దూరంగా ఉంచడానికి కోడి పిల్లల పెంపకం

స్పెషల్ సబ్జెక్టుగా తీసుకుని రీసెర్చ్ చేస్తున్న సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు

కోడి పిల్లలు.. మొక్కల పెంపకం బాధ్యతలతో మంచి ఫలితాలు

పిల్లలు అంటే ఆటలు, పాటలు, అల్లరి ఇవే కదా గుర్తొచ్చేవి. అయితే గత పదేళ్లుగా పరిస్థితి మారి పోయింది. ఆన్ లైన్ గేమ్స్, స్మార్ట్ ఫోన్లలో మునిగి పోయిన పిల్లలు బేసిక్ ఎమోషన్స్ లేకుండా తయారవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. పిల్లలని స్మార్ట్ ఫోన్ నుంచి ఎలా దూరంగా ఉంచాలో స్పెషల్ సబ్జెక్ట్ గా తీసుకొని మరీ సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు రీసెర్చ్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్విరాన్ మెంట్ నుంచి పిల్లలు దూరం కావటం, పబ్ జి లాంటి గేమ్స్ వల్ల వాళ్లలో పెరిగి పోతున్న వయొలెన్స్ టెండెన్సీని తగ్గించటానికి మంచి ఆలోచన చేసింది ఇండోనేసియాలోని బాండుంగ్ సిటీ గవర్నమెంట్. స్కూల్ అయిపోయాక హోంవర్క్‌‌ చేయకుండా స్మార్ట్‌‌ఫోన్లకు, ఆన్‌‌లైన్‌‌ గేమ్‌‌ షోలకు అతుక్కుపోతున్న పిల్లలకి కోడి పిల్లలని, మొక్కలని ఇచ్చారు. వాటిని పెంచే బాధ్యత కూడా వాళ్లదే అని చెప్పారు. ఇలా పన్నెండు స్కూళ్లలో  ఉండే రెండు వేలమంది పిల్లలకి పెట్స్ గా పెంచుకోవటానికి కోడి పిల్లలని ఇచ్చారు.

ప్రతిరోజూ వాటికి నీళ్లు, దాణా ఇస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని, హోంవర్క్‌‌ పూర్తయ్యాక వాటితోనే ఆడుకోవాలని చెప్పారు. దీనివల్ల వాళ్లలో ఉండే ఎమోషన్స్ బ్యాలెన్స్ అవుతాయని, పిల్లలు  సున్నితంగా ఆలోచిస్తారని, బాధ్యతగా ఉండటమే కాకుండా లైఫ్‌‌లో ఉండే ప్లానింగ్‌‌ని నేర్చుకోవటానికి అలవాటు పడతారనీ చెబుతున్నారు. స్కూల్ నుంచి రాగానే ఎంతో ఉత్సాహంగా కోడిపిల్లలతో ఆడుకుంటూ, మొక్కలకి నీళ్లు పోస్తూ, వాటిని ఆరోగ్యంగా ఉంచటానికి ఏమేం చేయాలో నేర్చుకుంటున్నారట ఆ పిల్లలు. ఈ ప్రయోగం ఏదో బాగానే ఉంది. మనదగ్గర కూడా ఇది వర్కవుట్ అవ్వొచ్చేమో.

for more News..