ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో అతి భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. తీర ప్రాంతాలు ఖాళీ

ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో అతి భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. తీర ప్రాంతాలు ఖాళీ

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపానికి భారీ ప్రకంపనలు సంభవించాయి. ఇంత తీవ్రతతో వచ్చిన భూకంపంతో సునామీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం (2026 జూన్ 08) ఉదయం వచ్చిన భూకంపం తీవ్రతకు ఫిలప్పీన్స్ తో పాటు పొరుగు దేశాలైన వియత్నాం, కంబోడియా తదితర దేశాలలో కూడా ప్రకంపనలు వచ్చాయి. 

7.8 తీవ్రతతో భాకంపం రావడంతో  దీంతో తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు అధికారులు. మిందనావో కు దగ్గరలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ ఫర్ జియో సైన్సెస్ (GFZ)  పేర్కొంది. మొదట 7.3 నుంచి 8.2 గా పేర్కొన్న సంస్థ... తర్వాత భూకంప తీవ్రతను 7.8 కి సవరించింది. .

7.8 వీవ్రతతో వచ్చిన భూకంపంతో భారీగా కుదుపులు వచ్చినట్లు ఫిలిప్పీన్స్ మీడియా పేర్కొంది.  ఫిలిప్పీన్స్ తో పాటు, ఇండోనేషియా దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు తరలించారు. భూకంపం తర్వాత సముద్ర తీరాలలో నీరు భారీగా ఎగసిపడుతోందని.. ప్రస్తుతం కాస్త శాంతించినట్లు పేర్కొన్నారు. 

  • కూలిన బిల్డింగులు.. పరుగులు తీసిన జనం

భారీ ఎత్తున వచ్చిన భూకంపానికి వచ్చిన కుదుపులకు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇండ్లు వదిలేసి బయటకు పరుగులు తీశారు. బిల్డింగులు కూలిపోతున్న దృశ్యాలు భయాందోళనలకు గురి చేశాయి. అక్కడక్కడ బిల్డింగ్స్ పెచ్చులు ఊడినట్లు పేర్కొన్నారు. కొన్ని పాత భవంతులు కూలినట్లు తెలిపారు. 

అప్పుడప్పుడే స్కూల్స్ ప్రారంభమైన సమయంలో భూకంపం రావటం విద్యార్థులను గ్రౌండ్స్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. రోడ్లపైన వెళ్తున్న వాహనాలు పక్కకు ఆపుకుని వాహనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొన్నారు స్థానిక అధికారులు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ జూనియర్. 

పసిఫిక్ రింగ్ ఫైర్ లో ఉన్న ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో భూకంపాలు ఎక్కువగా రావటం తెలిసిన విషయంమే. అయితే సోమవారం వచ్చిన భూకంపంతో ప్రస్తుతం భారీ నష్టం లేకపోయినా.. ఆ తర్వాత పరిణామాలు ఎక్కువ గా ఉండవచ్చునని అమెరికా భూకంప కేంద్రం పేర్కొంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించింది. సునామీ వచ్చే ప్రమాదం ఉండటంతో తీర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా ఉండాలని పేర్కొంది.