జపాన్లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం

జపాన్లో 7.3 తీవ్రతతో భారీ భూకంపం

జపాన్లో భారీ భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.36గంటల (భారత కాలమానం ప్రకారం రాత్రి 8.06గంటల) సమయంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.గా నమోదైంది. ఫుకుషిమా తీర ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.  తీవ్రత భారీగా ఉండటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

సముద్రం అడుగున 60 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ ప్రకటించింది. 11ఏళ్ల క్రితం రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చి సునామీకి కారణమైన ప్రాంతంలోనే ఈసారి భూమి కంపించింది. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు. అయితే భూ ప్రకంపనల కారణంగా దాదాపు 20 లక్షల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. టోక్యో నగరంలో 7లక్షల ఇళ్లు అంధకారంలో చిక్కుకున్నాయి. భూకంపం ప్రభావం ఫుకిషిమా న్యూక్లియర్ ప్లాంట్ పై ఎంత మేరకు పడిందన్న విషయాన్ని సైంటిస్టులు పరీక్షిస్తున్నారు.