జనవరి 20న కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం : డాక్టర్ జి. సృజన

జనవరి 20న కొత్త సర్పంచుల ప్రమాణ స్వీకారం : డాక్టర్ జి. సృజన
  •  గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలు కొలువు దీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల తొలి సమావేశం నిర్వహించడంతోపాటు నూతన సర్పంచులు, వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్​ డాక్టర్ జి. సృజన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించడానికి 20 వతేదీని ఖరారు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17 నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన అన్ని పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.