ప్రభాస్ ఫ్యాన్స్ రక్త తిలకం.. బీర్ బాటిల్తో చేయి కోసుకుని

ప్రభాస్ ఫ్యాన్స్ రక్త తిలకం.. బీర్ బాటిల్తో చేయి కోసుకుని

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా చేస్తున్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమా జూన్ 16 శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో థియేటర్స్ దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఆదిపురుష్’ సంబరాలు మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా పెద్ద పెద్ద కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేస్తున్నారు. 

అయితే ఈ సంబరాల్లో ప్రభాస్ ఫ్యాన్ ఒకరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. ప్రభాస్ కటౌట్ వద్ద డాన్స్ చేస్తూ జై ప్రభాస్ అంటూ బీర్ బాటిల్ పగలగొట్టి తో దాంతో తన చేయి కోసుకున్నాడు. అలా నాలుగైదు సార్లు చేసి ఆ రక్తంతో ప్రభాస్ ఫోటోకు తిలకం దిద్దాడు. ఇదంతా పక్కనే ఉన్న ఫ్యాన్స్ తన ఫోన్ లో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. 

సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ అయ్యింది కానీ.. ఏ ప్రాంతంలో.. ఏ ధియేటర్ దగ్గర జరిగింది అనేది మాత్రం బయటకు రాలేదు. మొత్తాన్ని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆదిపురుష్ సినిమా హాళ్ల దగ్గర సందడి మామూలుగా చేయటం లేదు. కటౌట్లకు పాలాభిషేకాలు, గజమాలలు వేయటం, టెంకాయలు కొట్టటం, హారతులు ఇవ్వటం వంటివి చేస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

 

https://twitter.com/thedevilmonstr/status/1669521249477984256