Prabhas-Rajamouli: 'బాహుబలి ది ఎపిక్' రికార్డుల మోత.. బాలీవుడ్ చిత్రాల కలెక్షన్లకు బ్రేక్!

Prabhas-Rajamouli: 'బాహుబలి ది ఎపిక్' రికార్డుల మోత.. బాలీవుడ్ చిత్రాల కలెక్షన్లకు బ్రేక్!

దర్శకధీరుడు ఎస్.ఎస్ . రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్, రానా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ' బాహుబలి'  2015లో రిలీజైనఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సృష్టించింది.  ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చేసింది. ఈ తర్వాత వచ్చిన 'బాహుబలి 2' సంచలనం సృష్టించి రికార్డులను తిరగరాసింది.  ఆ చరిత్రను మరోసారి నిజం చేస్తూ .. అక్టోబర్ 31న రీ-రిలీజ్ అయిన 'బాహుబలి - ది ఎపిక్' అద్భుతాలు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ చిత్రాలను బోల్తా కొట్టిస్తుంది.

రికార్డు కలెక్షన్స్..

 'బాహుబలి' సిరీస్  రెండు భాగాలను కలిపి, కొత్తగా ఎడిట్ చేసి, 3 గంటల 45 నిమిషాల నిడివితో'బాహుబలి : ది ఎపిక్'  విడుదలైంది. ఇప్పుడిది భారతదేశంలో రీ-రిలీజ్ అయిన చిత్రాల కలెక్షన్ల రికార్డులను సునామీలా తుడిచిపెడుతోంది. అత్యంత వేగంగా అగ్రస్థానానికి 'ది ఎపిక్''బాహుబలి - ది ఎపిక్' కేవలం నాలుగు రోజుల్లోనే దేశంలో రీ-రిలీజ్ అయిన చిత్రాల్లో నాల్గవ అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.  ఈ క్రమంలో రణబీర్ కపూర్, దీపికా పడుకొనే నటించిన 'యే జవానీ హై దీవానీ'  రికార్డును బద్దలు కొట్టింది. ఆ సినిమా కొన్ని వారాల్లో సాధించిన రూ.25.4 కోట్ల వసూళ్లను 'బాహుబలి - ది ఎపిక్' నాలుగు రోజుల్లోనే అధిగమించింది. మొదటి నాలుగు రోజుల్లో 'బాహుబలి : ది ఎపిక్'  చిత్రం దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.00 కోట్ల నికర వసూళ్లను సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది..

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే?

భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా 'బాహుబలి - ది ఎపిక్' రీ-రిలీజ్‌లో తన సత్తా చాటింది. ఈ 4 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన రీ-రిలీజ్ ఫిల్మ్‌గా చరిత్ర సృష్టించింది. ఓపెనింగ్ డే కలెక్షన్లు కూడా దళపతి విజయ్ 'గిల్లి' రికార్డును కూడా దాదాపు బద్దలు కొట్టింది. ఈ  తెలుగు సినిమా పట్ల  ప్రేక్షకులలో ఉన్న ఆదరణను మరో సారి నిరూపిస్తుంది.

టార్గెట్ టాప్ 1..

'బాహుబలి - ది ఎపిక్' ఇండియాలో మొదటి స్థానాన్ని దక్కించుకోవడానికి ఇంకా మారో  రెండు చిత్రాల రికార్డులను బద్దలు కొట్టాల్సి ఉంది .  వాటిల్లో బాలీవుడ్ చిత్రాలు తుంబాడ్ సోహమ్ షా రూ.30.48 కోట్లు, సనమ్ తేరి కసమ్ హర్షవర్ధన్ రాణే రూ.33.18 కోట్లు సాధించాయి. ఈ రెండు చిత్రాలను దేశీయంగా అధిగమించాల్సి ఉంది.  ఇక సోమవారం రోజున వసూళ్లు భారీగా తగ్గినా..  వారాంతంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం మళ్లీ ఊపందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రికార్డుల పరంపర 'బాహుబలి' కేవలం సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా గర్వం అని మరోసారి నిరూపించింది. మరి ఈ రికార్డులను అధిగమిస్తుందో లేదో చూడాలి.