సలార్ ట్రైలర్ బిగ్ అనౌన్స్మెంట్.. ఇక విధ్వంసం మొదలు!

సలార్ ట్రైలర్ బిగ్ అనౌన్స్మెంట్.. ఇక విధ్వంసం మొదలు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ అండ్ వీడియోస్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. హోంబలెే ఫిలిమ్స్(Hombale films) అత్యంత ప్రతుష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దీంతో ఈ సినిమా నుండి వరుస అప్డేట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే సలార్ ట్రైలర్ ను రేలసే చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. దీనికి సంబందించిన హిట్ కూడా ఇచ్చేసింది నిర్మాన సంస్థ. ఇటీవల హోంబేలె సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చివర్లో సలార్ ట్రైలర్ కమింగ్ సూన్ అంటూ హిట్ ఇచ్చారు.  దీంతో త్వరలోనే సలార్ ట్రైలర్ రానుందని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్. అయితే ఈ వీడియో లో ట్రైలర్ డేట్ ను మాత్రం మెన్షన్ చేయలేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇక సాలార్ సినిమా విషయానికి వస్తే.. సలార్ సినిమా రెండు పార్ట్స్ గా ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయనుంది. మొదటి పార్టీ కు సలార్: సీజ్ ఫైర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ హీరో పృద్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా నటిస్తున్నారు. కెజిఎఫ్ అదిరిపోయే మ్యూజిక్ ను అందించిన రవి బాసృర్ ఈ సినిమాకు కేసుల సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.