కల్కి పాత్ర కామెడీగా ఉంటుందా? ప్రభాస్ ఏంటి అలా అనేశాడు.

కల్కి పాత్ర కామెడీగా ఉంటుందా? ప్రభాస్ ఏంటి అలా అనేశాడు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2989 AD). ఈ సినిమా నుండి తాజాగా రిలీజైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. గ్లింప్స్ లో విజువల్స్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. దీంతో.. ఈ గ్లింప్స్ చూసిన చాలా మంది ఈ సినిమాతో ఇండియన్ సినిమా హాలీవుడ్ రేంజ్ ఇంపాక్ట్ చూపించడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో హిందూ మైథాలజీని టచ్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin). కలియుగాంతంలో విష్ణు మూర్తి కల్కి అవతారంలో మళ్ళీ వస్తారని పురాణాల్లో రాసుంది. దాని ప్రకారమే నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కల్కి అవతరంలో ప్రభాస్ కనిపిస్తుండటంతో.. ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఈ సినిమా చూడటానికి. 

అయితే ఈ కల్కి పాత్ర చాల పవర్ ఫుల్ గా ఉంటుందని గ్లింప్స్ చూస్తేనే అర్థం అవుతోంది. కానీ కామిక్ కాన్ ఈవెంట్ లో మాట్లాడిన ప్రభాస్ మాత్రం ఈ పాత్ర చాలా కామెడీగా ఉంటుందని, నాగ్ అశ్విన్ ఈ క్యారెక్టర్ ను చాలా డిఫరెంట్ గ డిజైన్ చేశారని చెప్పుకొచ్చారు. అయితే ఈ న్యూస్ విన్న ఆడియన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కల్కి పాత్ర కామెడీగా ఉండటం ఏంటి? ప్రపంచాన్ని కాపాడే యోధుడిగా కనిపించే పాత్ర కామెడీ చేస్తే ఆ ఇంపాక్ట్ ఉంటుందా. గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశారు సరే.. కల్కి పాత్రను కామెడీ మాత్రం చేయకండి సార్ ప్లీజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పాత్ర కొంచం అంటూ ఇటు అయినా.. ఆదిపురుష్ రేంజ్ లో నెగిటీవ్ కామెంట్స్ రావడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు విడుదల తరువాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.