Prabhas: లండన్లో ఇల్లు తీసుకున్న ప్రభాస్.. ఇకనుండి అక్కడేనట!

Prabhas: లండన్లో ఇల్లు తీసుకున్న ప్రభాస్.. ఇకనుండి అక్కడేనట!

స్టార్స్ అంటేనే లగ్జరీ లైఫ్. ఉండే ఇల్లు, వాడే కార్లు, వేసుకునే బట్టలు అన్నీ బ్రాండెడ్ వె వాడుతుంటారు. అందుకోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. కేవలం ఇండియాలోనే కాదు ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉండటానికి పెర్మనెంట్ రెసిడెన్సీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా విదేశంలో ఇల్లు తీసుకున్నాడట. అది కూడా లండన్ లో. అదేంటి ఇండియాలో ఉండే ప్రభాస్ కు లండన్ లో ఇల్లు ఎందుకు అనుకుంటున్నారా. 

అదే ఇక్కడ విశేషం. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ప్రభాస్ రెండు, మూడు సార్లు లండన్ కి వెళ్లివచ్చార. ఆయన కాలికి జరిగిన ఆపరేషన్ కూడా లండన్ లోనే చేయించుకున్నాడు. ఇందుకోసం ప్రభాస్ రెగ్యులర్ గా లండన్ వెళ్లాల్సి వస్తోందట. ఇలా ప్రతీసారి వెళ్లడం అక్కడ హోటల్ లో స్టే చేయడం ఇబ్బందిగా ఉందంట. అందుకే.. ఒక ఇల్లును రెంట్ కి తీసుకున్నాడట ప్రభాస్. ఆ ఇంటి రెంట్  రూ.20 లక్షల వరకు ఉంటుందని టాక్. దీంతో ప్రభాస్ లండన్ లో ఇల్లు తీసుకున్న విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభాస్ ఇల్లు తీసుకున్న విషయంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ALSO READ :- ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే సలార్(Salaar) తో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ త్వరలో కల్కి 2898 AD(Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 9న థియేటర్స్ లోకి రానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.