పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే ఆయన సినిమాలతో పాటు, ఆయన గొప్ప మనసు, అతిథి మర్యాద కూడా గుర్తుకొస్తాయి. ఆయన పెద్ద ఫుడ్డీ కూడా. సెట్స్‌లో తన కో-స్టార్స్‌కు, దర్శకులకు, టీం మెంబర్స్‌కు ఇంటి నుంచి స్వయంగా వండిన రుచికరమైన వంటకాలతో విందు ఇస్తూ గౌరవించడం ప్రభాస్‌కు అలవాటు. ఈ ఆతిథ్యాన్ని రుచి చూసిన సెలబ్రిటీల లిస్ట్‌లో లేటెస్ట్ గా 'ఫౌజీ' చిత్రంలో ఆయన సరసన నటిస్తున్న యువ నటి ఇమాన్వీ చేరిపోయింది. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే, దేశభక్తి ప్రధానంగా సాగే ఈ పీరియాడిక్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సెట్‌లో ప్రభాస్ గెస్ట్ ట్రీట్‌మెంట్..
ప్రస్తుతం హైదరాబాద్‌లో 'ఫౌజీ' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్ బ్రేక్‌లో, ప్రభాస్ తన ఇంటి నుంచి సిద్ధం చేయించిన విభిన్న రకాల వంటకాలతో కూడిన భారీ ఫుడ్ స్ప్రెడ్ను ఇమాన్వీకి పంపించారు. ఈ సర్ ప్రైజ్ చూసి ఆనందంతో మునిగిపోయిన ఇమాన్వీ, వెంటనే ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. గుండె, పొట్ట రెండూ నిండిపోయాయి. థాంక్యూ ప్రభాస్ గారూ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో, అభిమానులు ప్రభాస్ దయార్థ్ర హృదయాన్ని మరోసారి ప్రశంసల్లో ముంచెత్తారు. గతంలో శ్రుతి హాసన్, తమన్నా, సంజయ్ దత్ వంటి అగ్ర నటులు కూడా ప్రభాస్ ఆతిథ్యాన్ని ఇలా అందించారు. ఆ సందర్భంగా ప్రభాస్ ను గొప్పగా కొనియాడారు.
ఈ భారీ చిత్రాన్ని హను రాఘవపూడి (సీతారామం ఫేమ్) అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. స్పష్టమైన డీటైలింగ్, భావోద్వేగభరితమైన కథనం హను శైలి. ఈ సినిమా 1940ల కాలంలో జరిగిన ఒక యుద్ధం, ప్రేమ, మరుగునపడిన చరిత్ర అంశాల కలయికతో రూపొందుతోంది. సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే, దేశభక్తి ప్రధానంగా సాగే ఈ పీరియాడిక్ డ్రామాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
'ఫౌజీ'పై భారీ అంచనాలు..
ప్రభాస్, ఇమాన్వీ కలిసి నటిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా 'ఫౌజీ'పై అంచనాలు భారీగా ఉన్నాయి. 'సీతారామం' వంటి క్లాసిక్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పష్టమైన డీటైలింగ్, భావోద్వేగభరితమైన కథనం హను శైలి. 1940ల నాటి రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంతో, దేశభక్తి, ప్రేమ, మరుగునపడిన చరిత్ర అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా అవుట్‌పుట్‌పై ప్రభాస్ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని ఇండస్ట్రీ టాక్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, రాహుల్ రవీంద్రన్ వంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. సినిమాను 2026 ఆగస్టు లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇమాన్వీపై ట్రోల్స్..
ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది ఇమాన్వీ. అంతకుముందు ఆమె 'తుమ్ తుమ్' డ్యాన్స్ రీల్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. అయితే, ఇటీవల ఆమెపై పాకిస్థాన్ మిలిటరీతో సంబంధాలున్నాయంటూ ఆన్‌లైన్‌లో పుకార్లు షికారు చేశాయి. ఈ ఆరోపణలను ఇమాన్వీ గట్టిగా ఖండించింది. మా కుటుంబంలో ఎవరూ పాకిస్థాన్ సైన్యంలో లేరు. నేను గర్వించదగిన ఇండియన్ అమెరికన్. నేను లాస్ ఏంజిల్స్‌లో పుట్టాను. మా తల్లిదండ్రులు అమెరికాకు చట్టబద్ధంగా వలస వెళ్లారు. నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడతాను. కళ ద్వారా ప్రజలను ఏకం చేయాలనేదే నా లక్ష్యం అంటూ ఒక వివరణాత్మక పోస్ట్ పెట్టి ట్రోల్స్‌కు చెక్ పెట్టింది.
Heart and stomach so so full ❤️
— Imanvi (@imanviactress) November 9, 2025
Thank you #Prabhas garu .. pic.twitter.com/7oepJ5RVkf
