కమల్ మూవీలో ప్రభుదేవా నటిస్తున్నాడా?

కమల్ మూవీలో ప్రభుదేవా నటిస్తున్నాడా?
చెన్నై: విశ్వనటుడు కమల్ హాసన్ ఒకవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరోవైపు సినిమాలనూ చేస్తున్నాడు. టాప్ డైరెక్టర్ శంకర్‌‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారతీయుడు-2లో కమల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ పూర్తికాక ముందే మరో ఫిల్మ్‌‌‌కు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కార్తీతో ఖైదీ లాంటి హిట్ మూవీని తీసిన లోకేశ్ కనగరాజన్‌‌ డైరెక్షన్‌‌లో విక్రమ్ అనే చిత్రంలో కమల్ యాక్ట్ చేయనున్నాడు. ఇళయ దళపతి విజయ్‌‌తో మాస్టర్‌‌ను తీస్తున్న లోకేశ్.. పొంగల్‌‌కు ఈ సినిమాను రిలీజ్ చేయాలని స్కెచ్ వేస్తున్నాడు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. కమల్‌‌తో కనగరాజ్ తీస్తున్న చిత్రంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, నటుడు ప్రభుదేవా నటించనున్నట్లు సమాచారం. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటులకు సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా వెలువడనున్నాయని తెలుస్తోంది. రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ టైటిల్ టీజర్‌‌కు ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ వస్తోంది.