WOLF Teaser: అనసూయ అరాచకత్వం, పురాణాలతో వుల్ఫ్ టీజర్..

WOLF Teaser: అనసూయ  అరాచకత్వం, పురాణాలతో వుల్ఫ్ టీజర్..

ప్రభుదేవా(Prabhu Deva) హీరోగా వినూ వెంకటేష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ వుల్ఫ్ (Wolf). ప్రభుదేవా కెరీర్లో 60 వ చిత్రంగా రాబోతుండటం విశేషం. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అనసూయ  అరాచకత్వం, పురాణాలతో వూల్ఫ్ టీజర్ ఆసక్తి కలిగిస్తోంది.  అనసూయ భరద్వాజ్ ఏదో మాయలోకంలో కన్యలా కనిపిస్తూ ఆకర్షిస్తుంది. లక్ష్మిరాయ్ తన వయ్యారాలతో కుర్రాళ్లకు మత్తేక్కేస్తుంది. ఈ మూవీలో అనసూయ, లక్ష్మీ రాయ్ చాలా రొమాంటిక్ ఫోజులతో ప్రభుదేవాను ఫిదా చేస్తున్నారు. న్యూరాన్ సమస్యతో ప్రభుదేవానూ..ఏదో మాయ శక్తులతో తిరిగి తీసుకురావడం కోసం జరిగే కథని తెలుస్తోంది. 

అలాగే ఒక గూడెంలోని  వారిని వంచించేలా .. మాయ ద్వీపంలో బందించి వారిని హింసించేలా..చేతిలో తిప్పే చక్రంతో చేసే మాయ.. ఇలా డిఫరెంట్ ఎలెమెంట్స్ తో  టీజర్ చాలా ఇంటెన్సివ్ గా ఉంది. వూల్ఫ్ మూవీ కాన్సెప్ట్  ఏంటనేది తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ప్రభుదేవా ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. 
 

నిన్న (ఆగష్టు 2న) రిలీజ్ చేసిన పోస్టర్ లో.. మూవీ టైటిల్ ని తెలుగులో తప్పుగా ప్రింట్ చేశారు. వుల్ఫ్ కి బదులు వూల్ఫ అని ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో అందరూ విమర్శల వర్షం కురిపించడంతో, మళ్లీ టైటిల్ ను మార్చి, కరెక్ట్ గా ప్రకటించారు.

ప్రభుదేవా మెయిన్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీలో అంజు కురియన్, లక్ష్మీ రాయ్, MS భాస్కర్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకు అమ్రిష్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. గత సంవత్సరం షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ పోస్ట్ ఫోన్ అవుతూ వస్తుండగా..మరికొన్ని రోజుల్లో మూవీ షూటింగ్ తుది దశకు చేరుకోనుందని సమాచారం. కాగా ప్రభుదేవా కోరియోగ్రఫర్‌‌‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత యాక్టర్ గా మారి డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు 

ఈ మూవీను సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు.