‘ప్రభుత్వ సారాయి దుకాణం’ టీజర్ విడుదల.. స్టోరీ ఏంటంటే..

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ టీజర్ విడుదల.. స్టోరీ ఏంటంటే..

విక్రమ్ జిత్, సదన్ హాసన్, శ్రీలు, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా  నరసింహ నంది రూపొందించిన చిత్రం ‘ప్రభుత్వ సారాయి దుకాణం’.   దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మించారు. మంగళవారం టీజర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ ‘ఈ కథను రెండు భాగాలుగా అనుకుని  సినిమా మొదలుపెట్టాను. ఇందులోని  ప్రతి పాత్ర  పురాణాల నుండి ఏదో ఒక పాత్రను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి’ అని చెప్పాడు.

విక్రమ్ జిత్ మాట్లాడుతూ ‘ప్రతి  మనిషి లోపల రెండు కోణాలు ఉంటాయి. ఒకటి కనిపించేది,  మరొకటి కనిపించనిది. ఈ సినిమా ద్వారా మహిళల శక్తి సామర్థ్యాలు ఎంత బలంగా ఉంటాయో చూపించబోతున్నాం’ అని అన్నాడు.  ‘కొన్ని వాస్తవ సంఘటనల ప్రేరణతో శ్రీ శక్తి ప్రధానాంశంగా తీసిన సినిమా. కొందరు రాజకీయ నేతల వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుంది’ అని నిర్మాతలు అన్నారు.