లీడర్లను అడ్డుకోవడం దారుణం

లీడర్లను అడ్డుకోవడం దారుణం

మందమర్రి,వెలుగు: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో 'ప్రజా గోస.. బీజేపీ భరోసా' యాత్రలో పాల్గొంటున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం మందమర్రిలో బీజేపీ లీడర్లు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి, జిల్లా జనరల్​సెక్రటరీ అందుగుల శ్రీనివాస్​ మాట్లాడుతూ పోలీసులు, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

టీఆర్​ఎస్ పాలనలో ప్రజల బాధలు తెలుసుకోవడానికి వెళ్లిన మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి, లీడర్లను అడ్డుకోవడం దారుణమన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక టీఆర్ఎస్​లీడర్లు పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్​సప్పిడి నరేశ్, సీనియర్ లీడర్ రాంటెంకి దుర్గరాజ్, మందమర్రి ఇన్​చార్జి ఆకుల అశోక్​వర్ధన్, బీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు అక్కల రమేశ్, బీజేవైఎం జిల్లా లీడర్ గుడికందుల హరినాథ్, బీసీ మోర్చా జిల్లా సెక్రటరీ కొంత రాజం, టౌన్ జనరల్ సెక్రటరీలు అల్లంల నగేశ్, గడ్డం శ్రీనివాస్, యువ మోర్చా ప్రెసిడెంట్​ఓరిగంటి సురేందర్, లీడర్లు ఓదెలు, కుమారస్వామి, పల్ల శ్రీకాంత్, దాసరి వినోద్, వినయ్, సన్నీ, మేకల తిరుపతి, రాంకీర్తి శ్రీనివాస్​ పాల్గొన్నారు.