మునుగోడులో బీజేపీయే గెలుస్తుంది..

మునుగోడులో బీజేపీయే గెలుస్తుంది..

మునుగోడు బై ఎలక్షన్లో బీజేపీయే గెలుస్తుందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ లక్ష కోట్లు ఖర్చు చేసినా..బీజేపీ గెలుపును అడ్డుకోలేదన్నారు. మునుగోడు ఎన్నికల తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ ఖాళీ అవుతుందని..అంతా బీజేపీలో చేరతారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మునుగోడులో అడుగుపెడతానని తాను చెప్పినట్లు కేఏపాల్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం..ఆగస్టు 19,20 తేదీల్లో తాను మునుగోడులో పర్యటిస్తానని తెలిపారు. ఉప ఎన్నికలను బ్యాలెట్ ద్వారా  నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 

కేసీఆర్ను కలవాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా...కొంతమంది టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారని కేఏపాల్ అన్నారు.  కేటీఆర్  రాజకీయంగా ఇంకా పరిపక్వత చెందలేదు అని చెప్పారు. కేసీఆర్కు తనకు గొడవ పెట్టింది దిలీప్ కుమార్ అంటూ ఆరోపించారు. కేసీఆర్ను కలవటానికి అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వలేదని మండిపడ్డారు. తాను ఒక తెలుగు వాడిని అయినందుకే కేసిఆర్ చిన్న చూపు చూస్తున్నారని చెప్పారు.

మోడీ ప్రభుత్వంలో ఇండియా  ఆర్దికంగా దెబ్బతిన్నదని..త్వరలో భారత్ మరొక శ్రీలంక అవుతుందని పాల్ అన్నారు. యూపీ సీఎం యోగి దేశంలోనే వరస్ట్ సీఎం అని విమర్శించారు. మోడీ తరువాత తానే పీఎం అని కలలు కంటున్నాడని ఫైర్ అయ్యారు. తాను బీజేపీకి భయపడే ప్రసక్తే లేదని కేఏ పాల్ అన్నారు. ఈడీ, సీబీఐలతో బీజేపీ ప్రభుత్వం ఎవరినైనా భయపెట్టొచ్చు కానీ..తనను భయపెట్టలేదన్నారు. త్వరలో " సేవ్ ఇండియా ఫ్రం మోడీ" బుక్ ,వాల్ పోస్టర్ను  రిలీజ్ చేస్తున్నామని పేర్కొన్నారు.  మతతత్వ  బీజేపీ ,ఆర్ఎస్ఎస్, మోడీ నుండి దేశాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.