వీడిన ‘ప్రజాభవన్’ హత్య కేసు మిస్టరీ

వీడిన ‘ప్రజాభవన్’ హత్య కేసు మిస్టరీ

చిట్టీ పైసల  కోసం బెదిరిస్తున్నాడనే హత్య

హైదరాబాద్​, వెలుగు: శివరాంపల్లి ప్రజా భవన్ వద్ద సెప్టెంబర్ 8న కిషన్ బాగ్ కి చెందిన మొహమ్మద్ జావిద్(32) అనే వ్యక్తి హత్యకు గురికాగా ఆ కేసును పోలీసులు ఛేదించారు. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక చక్రవర్తి కథనం ప్రకారం..శాస్త్రీపురం ముస్తఫానగర్ కి చెందిన సయ్యద్ ఇర్ఫాన్(36) అన్సారీ రోడ్డులో చెప్పుల వ్యాపారంతో పాటు  చిట్టీల బిజినెస్  చేసేవాడు. ఇతడి దగ్గర మృతుడు మహమ్మద్ జావిద్ స్నేహితురాలు రూ.5 లక్షల చిట్టీ వేసింది. చిట్టీ పూర్తయ్యాక కరోనాతో డబ్బుల్లేవని 3లక్షలు ఇచ్చి 2 లక్షలు తర్వాత ఇస్తానని చెప్పాడు. ఎన్నిసార్లు తిరిగినా డబ్బులు ఇవ్వక పోవడంతో జావేద్ చంపేస్తానని బెదిరించాడు.  దీంతో జావెద్​నే చంపాలని ఇర్ఫాన్​ నిర్ణయించుకున్నాడు.  మొహ్మద్ అతుల్లా, షేక్ కాలీద్, జియావుద్దీన్ , మహ్మద్​వసీం(24), మీర్ అష్రాఫ్ అలీ(21), కిషన్ రావు(24) లతో కలిసి హత్యకు ప్లాన్​ వేశాడు. 8న  ఇర్ఫాన్ ..జావేద్ ను రాజేంద్రనగర్ లోని దక్కన్ ఎలైట్​హోటల్ కు వస్తే క్యాష్​ ఇస్తానని చెప్పాడు. అయితే శివరాంపల్లి ప్రజా భవన్ దగ్గరకు రావాలని చెప్పగా కారు, టీవీలర్​లో అక్కడికి వెళ్లారు. జావెద్​కు తన మామ ఫ్లాట్​ పేపర్లు ఇస్తున్నట్టు నటిస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఐదుగురు వేటకొడవళ్లతో జావేద్​ను హత్య చేశారు. పారిపోయే టైంలో టూవీలర్ ​స్టార్ట్ కాకపోవడంతో వదిలేసి వెళ్లారు. కేసును సవాలుగా తీసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఆరు రోజుల్లో నిందితులను అరెస్టు చేసి జడ్జి ముందు హాజరు పరిచారు.