బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలన్నీ ఒక్కటే : కేఏ పాల్

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలన్నీ ఒక్కటే : కేఏ పాల్

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించకుండా ఉండేందుకు కేసీఆర్, కేటీఆర్ మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్, సభ్యులు లేకుండా చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ధరణి పోర్టల్ తీసుకువచ్చి తమ ఛారిటీ భూములను ఆగం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ను కలిసేందుకు ప్రగతిభవన్ కు వెళ్తే తనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని చెప్పారు. ప్రభుత్వ అవినీతిపై తాను ప్రశ్నిస్తున్నందు వల్లే భయపడి కేసీఆర్ తనను కలవలేదన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలన్నీ ఒక్కటే అన్నారు కేఏ పాల్. కేసీఆర్ మిత్రుడు బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి అని చెప్పారు. తాను పేద ప్రజల కోసం పోరాటం చేస్తుండడం వల్లే తనను బీఆర్ఎస్ వాళ్లు ప్రధాన ప్రతిపక్షం అంటున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అందరికీ డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తానన్నారు. తన డబ్బు అంతా అమెరికాలో ఉందని, దాన్ని తీసుకువచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తానన్నారు. 

Also Read :- ధరణిపై నిజనిజాలు నిగ్గుతేలుస్తాం : రేవంత్ రెడ్డి

ఆరు నెలలుగా మానవ హక్కుల కమిషన్ కు  ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు చైర్మన్లు ఎవరూ లేరని చెప్పారు కేఏ పాల్. వారం రోజుల్లో మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లకు చైర్మన్లను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ లోనే జస్టిస్ చంద్రకుమార్ కు కేఏ పాల్ ఫోన్ చేశారు. మానవ హక్కుల కమిషన్ కు చైర్మన్ గా ఉంటారా..? అని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీ పేరును సూచిస్తానని చెప్పారు.