ఇయ్యాల్టి నుంచి కలెక్టరేట్​లో ప్రజావాణి

ఇయ్యాల్టి నుంచి కలెక్టరేట్​లో ప్రజావాణి
  • దాదాపు 3 నెలల తర్వాత షురూ  

హైదరాబాద్, వెలుగు :  ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించే ప్రజావాణి  సోమవారం నుంచి యధావిధిగా జరగనుంది. లోక్ సభ ఎన్నికల కారణంగా కోడ్​అమల్లోకి రావడంతో మార్చి 16 నుంచి ప్రజావాణి రద్దు చేశారు. ఈ నెల 6న ఎన్నికల కోడ్​ముగియడంతో తిరిగి కార్యక్రమాన్ని పున: ప్రారంభిస్తున్నట్లు కలెక్టరేట్అధికారులు తెలిపారు. 

బల్దియా హెడ్డాఫీసులో.. 

జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్ లో  ప్రజావాణి తిరిగి షురూ కానుంది. లోక్ సభ ఎన్నికల కోడ్ తో మూడు నెలలుగా  బంద్ పెట్టారు. కోడ్ ఎత్తివేయగా తిరిగి సోమవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ఇన్ చార్జ్ కమిషనర్  ఆమ్రపాలి  తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి  11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ 040-–23222182 కు తమ సమస్యలపై సంప్రదించాలని సూచించారు. అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని, ప్రజావాణి జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో నిర్వహిస్తామరి కమిషనర్ పేర్కొన్నారు.