భారత్‌కు వస్తున్న.. నిర్దోషినని నిరూపించుకుంటా : ప్రజ్వల్ రేవణ్ణ వీడియో రిలీజ్

 భారత్‌కు వస్తున్న.. నిర్దోషినని నిరూపించుకుంటా :  ప్రజ్వల్ రేవణ్ణ వీడియో రిలీజ్

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తాను తిరిగి  భారత్‌కు వస్తున్నట్లుగా తెలిపారు. మే 31న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరవుతానని తెలిపారు.  ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ఈ వీడియోలో ప్రజ్వల్ రేవణ్ణ మాట్లాడుతూ తన ప్రత్యర్థులు పన్నిన రాజకీయ కుట్రలో భాగంగానే తనపై లైంగిక ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై న్యాయపరంగా పోరాడి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పారు.  

ఈ వీడియోలో ప్రజ్వల్ తన తల్లిదండ్రులు, తాత, బాబాయ్ హెచ్‌డి కుమారస్వామి, జెడి(ఎస్) కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాడు. ఈ కేసు నుంచి తాను బయటపడుతానని అన్నారు.  వందలాది మంది మహిళలపై తాను అత్యాచారం చేశానని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలు చేసిన ఆరోపణల కారణంగా తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని ప్రజ్వల్ వీడియోలో తెలిపాడు.  
.
ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా హాసన్‌లో ఓటు వేసిన ఒక రోజు తర్వాత  అంటే ఏప్రిల్ 27న జర్మనీకి పారిపోయారు.  ఈ క్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ద్వారా సిట్ చేసిన అభ్యర్థన మేరకు రేవణ్ణ ఆచూకీపై సమాచారం కోరుతూ ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ చేసింది. అంతేకాకుండా సిట్ నుండి వచ్చిన దరఖాస్తు ఆధారంగా ఎన్నికైన ప్రతినిధుల కోసం ప్రత్యేక కోర్టు మే 18న అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.