తిరుమల లడ్డు వివాదంలో జస్ట్ ఆస్కింగ్ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వరుస ట్వీట్లు చేసిన నటుడు ప్రకాశ్ రాజ్ లేటెస్ట్ గా తెలంగాణ రాజకీయాలపై ట్వీట్ చేశారు. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా? జస్ట్ ఆస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వీడియోను ప్రకాశ్ రాజ్ ట్యాగ్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.
సమంత నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్ : కొండా సురేఖ
అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవటానికి కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణం అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంతనే కాకుండా.. కొంత మంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవటానికి కూడా కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు.
Also Read :- ఇతరుల పిల్లలు ముఖ్యం కాదా : పూనమ్ కౌర్ పోస్ట్
సినీ ఇండస్ట్రీలో చాలా మందికి.. ముఖ్యంగా హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసింది కూడా కేటీఆర్ అంటూ విమర్శించారు మంత్రి సురేఖ. మంత్రి పదవి అడ్డుపెట్టుకుని అధికార మదంతో.. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నది కేటీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి.
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking https://t.co/MsqIhDpbXa
— Prakash Raj (@prakashraaj) October 2, 2024