తెలుగులో ఒకప్పుడు వరుస చిత్రాల్లో నటించిన హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. కొందరు హీరోలు, దర్శకుల గురించి తనదైన శైలిలో.. కామెంట్స్ చేస్తూ నిత్యం తెలుగు వార్తల్లో హాట్ టాపిక్ అవుతుంటారు. లేటెస్ట్ గా ఆమె చేసిన కామెంట్స్.. కలకలం రేపుతున్నాయి.
నటి పూనమ్ కౌర్.. 2024, అక్టోబర్ 2వ తేదీన తన ఇన్ స్టాలో షేర్ చేసిన స్టోరీ కాంట్రవర్సీ గా మారింది. క్యారెక్టర్ ధృవీకరణ కోసం.. చిన్న పిల్లలను ఉపయోగించుకోవడం సరి కాదు.. మీ పిల్లలలాగే ఇతరుల పిల్లలు ముఖ్యం కాదా అంటూ కామెంట్ చేశారు. చిన్న పిల్లల వరకు ఓకే.. ఇతరుల పిల్లలు ముఖ్యం కాదా అంటూ చేసిన కామెంట్ మాత్రం చర్చనీయాంశం అయ్యింది. ఎవరా ఇతరులు.. ఎవరా పిల్లలు.. ఎవరి పిల్లలు అనే ప్రశ్నలతో ఇప్పుడు సోషల్ మీడియా పలు రకాల చర్చలకు తెర తీసింది.
Also Read :- తమిళ బిగ్బాస్ సీజన్ 8 .. కంటెస్టెంట్స్ వీళ్లే!
మొన్నటికి మొన్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడిపై పోస్ట్ చేశారు పూనమ్ కౌర్. మా అసోసియేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆ దర్శకుడిని వారు పట్టించుకోలేదని ట్వీట్ చేసింది. దీంతో ఈ వ్యవహారం సినీ ఇండస్ట్రీ పెద్దల వరకూ వెళ్లడంతో వారు సంజాయిషీ ఇచ్చుకున్నారు. రెగ్యులర్ గానే చర్యలు మాత్రం తీసుకోలేదు.
దేశ వ్యాప్తంగా తిరుమల అంశం హాట్ టాపిక్ అయ్యింది. మొన్నటికి మొన్న లడ్డూ.. ఇప్పుడు డిక్లరేషన్ల ఇష్యూ నడుస్తుంది. ఈ సమయంలోనే పూనం కౌర్ పోస్ట్ చేయటం.. ఇతరుల పిల్లలు అంటూ ప్రస్తావించటం.. ఎవర్ని ఉద్దేశించి అనేది చర్చనీయాంశం అయ్యింది.