విష్ణు హామీ ఇస్తే రాజీనామా వెనక్కి తీసుకుంటా

విష్ణు హామీ ఇస్తే రాజీనామా వెనక్కి తీసుకుంటా

హైదరాబాద్: ‘మా’ ఎలక్షన్ ఫలితాల తర్వాత అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాశ్ రాజ్ దీనిపై స్పందించాడు. ‘మా’ కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణు ఒక హామీ ఇస్తే తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ప్రకాశ్ రాజ్ అన్నాడు. బైలాస్‌ను మార్చకుండా తెలుగేతర నటులకు ‘మా’లో పోటీ చేసే అవకాశాన్ని అలాగే ఉండనిస్తే రాజీనామాను ఉపసంహరించుకుంటానని చెప్పాడు. 

‘మేం రాజీనామాలు చేసి మంచు విష్ణు ప్యానెల్‌ స్వేచ్ఛగా పని చేయడానికి వీలును కల్పిస్తున్నాం. మమ్మల్ని గెలిపించిన ఓటర్ల  సంక్షేమం కోసం చూస్తూ ఉంటాం. వాళ్లు సరిగ్గా పని చేయకపోతే ప్రశ్నిస్తాం. మాకూ ఓట్లు వచ్చాయి. మేం కూడా బాధ్యతతో ప్రశ్నిస్తాం. ఓటర్ల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రశ్నిస్తూనే ఉంటాం. విష్ణు మా రాజీనామాలను ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. నేను నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా అని రాశాను. కానీ విష్ణు దాన్ని ఆమోదించలేదు. నేను నా రాజీనామాను వెనక్కి తీసుకుంటా. కానీ ఒక కండిషన్... విష్ణు తెలుగు వాడు కానివాడు పోటీ చేయడానికి అర్హుడు కాడని బైలాస్‌ను మార్చకపోతే నా సభ్యత్వాన్ని వెనక్కి తీసుకుంటా. ఒకవేళ మారిస్తే ఓటేయడానికో, గెలిపించడానికో అయితే రాజీనామాను తిరిగి తీసుకోను’ అని ప్రకాశ్ రాజ్‌ చెప్పాడు.

మరిన్ని వార్తల కోసం..

జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఐదుగురు టెర్రరిస్టులు హతం

ప్రకాశ్ రాజ్‌ ప్యానెల్‌లో గెలిచిన 11 మంది రాజీనామా

బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన వైఎస్ జగన్