గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

గోవా సీఎంగా ప్రమోద్‌ సావంత్‌ ప్రమాణం

గోవా సీఎంగా బీజేపీ నేత, ప్రస్తుత స్పీకర్‌ ప్రమోద్‌ సావంత్‌ సోమవారం అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. పారికర్‌ క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్న 11 మంది సావంత్‌తో పాటు మళ్లీ మంత్రులుగా ప్రమాణం చేశారు. గోవాకు సావంత్‌ 13వ ముఖ్యమంత్రి. మిత్రపక్షాలైన గోవా ఫార్వర్డ్‌ పార్టీ(GFP) అధినేత విజయ్‌ సర్దేశాయ్‌, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ(MGP) ఎమ్మెల్యే రామకృష్ణ ధవలికర్‌కు డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. పారికర్‌ వారసుడిని ఎంపిక చేసే విషయంలో మిత్రపక్షాల మధ్య ఆదివారం రాత్రి నుంచి విస్తృతస్థాయిలో చర్చలు సాగాయి. చివరికి ప్రమోద్‌ సావంత్‌ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.