లక్నో: కొన్నాళ్లుగా గాయాలు, ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఇండియా సీనియర్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ మంగళవారం (నవంబర్ 25) నుంచి జరిగే సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నమెంట్‌లో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. వీళ్లకు యంగ్ షట్లర్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. మెన్స్ సింగిల్స్‌లో ఐదో సీడ్ శ్రీకాంత్ తన తొలి రౌండ్‌లో మైరాబా లూవాంగ్ మైస్నమ్‌తో తలపడనుండగా, మూడో సీడ్ ప్రణయ్ కెవిన్ తంగమ్‌తో పోటీపడనున్నాడు.
మోకాలి గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరమైన ప్రియాన్షు రజావత్ ఈ టోర్నీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. మన్నెపల్లి తరుణ్ , సతీష్ కుమార్ కరుణాకరన్, శంకర్ ముత్తుసామి, కిరణ్ జార్జ్ కూడా బరిలో ఉన్నారు. విమెన్స్ సింగిల్స్‌లో యంగ్ స్టర్స్ ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, తస్నిమ్ మీర్, అన్మోల్ ఖర్బ్ టైటిల్ వేటలో ఉన్నారు.
