ఇండోర్: ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం ఇండియా జట్టులో దాదాపు అన్ని ప్లేస్‌లు ఖరారైనట్టే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ల మధ్యనే పోటీ తీవ్రంగా ఉంది. ఇలాంటి టైమ్‌లో జట్టులోకి కొత్త ప్లేయర్ రావడమే కష్టమనిపిస్తుండగా.. సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌గా కర్నాటక యువ పేసర్ ప్రసిధ్ కృష్ణను తీసుకుంటామని టీమిండియా కెప్టెన్ కోహ్లీ హింట్ ఇచ్చాడు. గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ బుమ్రా టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన రోజునే.. ఆస్ట్రేలియాలో జరిగే మెగా ఈవెంట్ కోసం కొత్త బౌలర్లను పరిశీలిస్తున్నామని కోహ్లీ చెప్పడం విశేషం. ‘డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ప్రసిధ్ కృష్ణ లాంటి ఒక ఆటగాడు వరల్డ్‌కప్‌లో సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌గా ఉంటాడని భావిస్తున్నా’ అని మ్యాచ్ అనంతరం విరాట్ అన్నాడు. కెప్టెన్ మాటలు బట్టి న్యూజిలాండ్ టూర్‌లో ప్రసిధ్ జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్‌లో కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణ గత సీజన్‌లో ఢిల్లీతో మ్యాచ్‌లో సూపర్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
