వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్ నుంచి ప్రతీక ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇండియా టీమ్‌‌లోకి షెఫాలీ వర్మ

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్ నుంచి ప్రతీక ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇండియా టీమ్‌‌లోకి షెఫాలీ వర్మ

నవీ ముంబై: విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెమీఫైనల్ ముంగిట ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాక్. అద్భుత ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఓపెనర్ ప్రతీక రావల్ గాయం కారణంగా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షెఫాలీ వర్మను జట్టులోకి తీసుకున్నారు. ఆదివారం బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఫీల్డింగ్ చేస్తుండగా రావల్ కుడి మోకాలికి, చీలమండకు గాయమైంది.  

ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో 51.33 సగటుతో 308 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ప్రతీక న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సెంచరీ కొట్టింది. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ఆస్ట్రేలియాతో తలపడనున్న నేపథ్యంలో రావల్ లేకపోవడం బ్యాటింగ్ లైనప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రభావం చూపనుంది. మరోవైపు కీపర్ రిచా ఘోష్ ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పైనా అనుమానాలున్నాయి.