శివరాం కోసం పోలీసుల సెర్చింగ్

శివరాం కోసం పోలీసుల సెర్చింగ్
  • శివరాం కోసం పోలీసుల సెర్చింగ్
  • ముంబై, పుణె, థానేలో స్పెషల్ టీమ్స్ గాలింపు
  • పోలీసులు వేధిస్తున్నారని హెచ్​ఆర్సీని ఆశ్రయించిన శివరాం ఫ్యామిలీ

హైదరాబాద్,/బషీర్‌‌‌‌బాగ్‌‌, వెలుగు: ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్‌‌ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. చిక్కడపల్లి, ముషీరాబాద్, సెంట్రల్‌‌ జోన్ టాస్క్‌‌ఫోర్స్‌‌ పోలీసులు సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టారు. మరోవైపు శివరాం ఆచూకీ కోసం అతని కుటుంబ సభ్యులు హెచ్‌‌ఆర్‌‌‌‌సీని ఆశ్రయించారు. పోలీసులు వేధిస్తున్నారని, తమను ఎన్‌‌కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. మహబూబ్‌‌నగర్‌‌‌‌తో పాటు శివరాం సొంతూరు కోస్గిలోని బంధువులు, ఫ్రెండ్స్‌‌ వద్ద స్పెషల్ టీమ్స్ వివరాలు సేకరించాయి.

వారం రోజులుగా వెతుకుతున్నా.. అతని ఆచూకీ దొరకడం లేదు. మహారాష్ట్రలోని పుణె, థానే, ముంబైలో శివరాం కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే థానేలో శివరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు గురువారం సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు మాత్రం అరెస్ట్‌‌ను నిర్ధారించ లేదు. ఇంకా శివరాం ట్రేస్ కాలేదని చెప్పారు. అయితే, ఇప్పటికే శివరాం ఆచూకీని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే వివరాలు వెల్లడించే అవకాశాలున్నాయి.

హెచ్​ఆర్సీలో బంధువుల పిటిషన్​

శివరాం రాథోడ్ ఎక్కడ ఉన్నాడో చెప్పాలని అతని కుటుంబ సభ్యులు, బంధువులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌‌ను ఆశ్రయించారు. శివరాం ఆచూకీ చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ మేరకు శివరాం సోదరుడు (కజిన్‌‌) సంతోష్ రాథోడ్‌‌ హెచ్​ఆర్సీలో పిటిషన్ దాఖలు చేశాడు. తమ బంధువులు, కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్​కు పిలిపించి మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నాడు.

శివరాం ఎక్కడ ఉన్నాడో చెప్పకపోతే ఎన్​కౌంటర్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో తెలిపాడు. శివరాం ఎక్కడ ఉన్నాడో తమకు తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్తామన్నారు. విచారణకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పినా.. పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. శివరాం కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.