పీజీ స్టూడెంట్ ప్రీతి మృతిపై ఆమె సోదరుడు పృథ్వీ పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. నిమ్స్ లో తన సోదరికి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని, అది ఎందుకు చేశారో తెలియదన్నాడు. ప్రీతికి పూర్తిగా శరీరంలో వైద్యులు బ్లడ్ డయాలిసిస్ చేశారని చెప్పాడు. - పోస్ట్మార్టంలో ప్రీతి బాడీలో ఉన్న ఇంజెక్షన్ గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించాడు. నిమ్స్ లో తన సోదరికి ఏం వైద్యం చేశారో చెప్పాలని డిమాండ్ చేశాడు. ఇక - ర్యాగింగ్ కమిటీపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని అన్నాడు. తప్పు చేసిన నాగార్జున రెడ్డిని కమిటీలో ఎలా ఉంచుతారని ప్రశ్నించాడు. ప్రీతి ఫోన్ లో ప్రతి ఒక్క మెసేజ్ తాను చెక్ చేశానని చెప్పిన పృథ్వీ.. తనకు కనిపించని మెసేజులు పోలీసులకు ఎలా కనిపించాయని అనుమానం వ్యక్తం చేశాడు. నాగార్జున రెడ్డి కమిటీ రిపోర్ట్ ను మార్చి ఉంటారని ఆరోపించాడు. తమకు న్యాయం జరగాలని పృథ్వీ డిమాండ్ చేశాడు.
