ఢిల్లీ అలర్ల కేసులో అరెస్టైన సఫూరా జార్గర్‌‌కు బెయిల్‌

ఢిల్లీ అలర్ల కేసులో అరెస్టైన సఫూరా జార్గర్‌‌కు బెయిల్‌
  • ప్రెగ్నెంట్‌ కావడంతో మానవత్వం కింద బెయిల్‌ మంజూరు

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితురాలు జామియా ఇస్లామియా స్టూడెంట్‌ సఫూరా జార్గర్‌‌కి ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఎంఫిల్‌ చదువుతున్న సఫూరా 23 వారా ప్రెగ్నెంట్‌ కావడంతో పోలీసులు తరఫున కోర్టుకు హాజరైన సొలిసిటర్‌‌ జనరల్‌ తుషార్‌‌ మెహత బెయిల్‌ ఇచ్చేందుకు అబ్జక్షన్‌ చెప్పలేదు. ఆమె ప్రెగ్నెంట్‌ కనుక బెయిల్‌ ఇచ్చేందుకు మాకు అభ్యంతరం లేదు అని ఆయన కోర్టులో చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఏప్రిల్ 10న ఆమెను అరెస్టు చేయగా.. బెయిల్ మంజూరు అయింది. ఆ తర్వాత మరో కేసులో ఆమెను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి బెయిల్‌ మంజూరు చేశారు. రూ.10వేల పూచీకత్తుపై బెయిల్‌ ఇచ్చారు. పర్మిషన్‌ లేనిది సిటీ దాటి బయటకు వెళ్లకూడదని చెప్పారు. కనీసం 15 రోజులకు ఒకసారి పోలీసులతో ఫోన్‌లో మాట్లాడాలని చెప్పారు. సీఏఏ, ఎన్నార్సీని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు చోటు చేసుకున్నాయి. జామియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన చాలా మంది స్టూడెంట్స్‌ ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.