మ్యాక్స్వెల్ను పెళ్లి చేసుకోలేదు.. అందుకే బాగా ఆడటం లేదు.. నెటిజన్ కామెంట్.. ఇచ్చిపడేసిన ప్రీతిజింటా

మ్యాక్స్వెల్ను పెళ్లి చేసుకోలేదు.. అందుకే బాగా ఆడటం లేదు.. నెటిజన్ కామెంట్.. ఇచ్చిపడేసిన ప్రీతిజింటా

ఐపీఎల్ -2025 సీజన్ లో మ్యాక్స్వెల్ పర్ఫామెన్స్ పై పంజాబ్ ఫ్యాన్స్ తో పాటు యాజమాన్యం కూడా అసంతృప్తిగా ఉందనే చెప్పాలి. అయితే మ్యాక్స్వెల్ పర్ఫామెన్స్ పై కామెంట్ చేస్తూ ఓ నెటిజన్ హీరోయిన్,  పంజాబ్ ఓనర్ అయిన ప్రీతిజింటాను అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజిన్ ప్రశ్నకు గట్టిగానే సమాధానం చెప్పింది ప్రీతి.

‘‘ప్రీతి మేడం.. మ్యాక్స్ వెల్ ను మీరు పెళ్లి చేసుకోలేదు. అందుకే సరిగ్గా ఆడటం లేదు.’’ అని ఒక ఆకతాయి సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. దీనికి మండిపోయిన ప్రీతిజింటా.. ‘‘ఇదే ప్రశ్న అన్ని టీమ్స్ లో ఉన్న మేల్ ఓనర్ల ను అడగగలవా..? కేవలం నేను మహిళా ఓనర్ అయినందుకే కదా ఈ ప్రశ్న అడుగుతున్నావు.. లింగ బేధం (జెండర్) తో డిస్క్రిమినేషన్ చేయడం ఎంత వరకు కరెక్ట్. కార్పోరేట్ సెటప్ ఉన్న ఇలాంటి ఈవెంట్స్ లలో మహిళలు నెట్టుకురావడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకేం తెలుసు. ’’ అని మండి పడింది.

అంతే కాకుండా ‘‘ఈ ప్రశ్న సరదాగా అడిగావని నాకు తెలుసు.. కానీ నీవు అడిగిన ప్రశ్న గురించి మరోసారి ఆలోచిస్తే.. నీవు అడిగింది కరెక్టేనా.. కాదా అనేది నీకే అర్థం అవుతుంది. గత 18 ఏళ్లుగా ఎంతో కష్టపడి, ఎన్నో దాటుకుంటూ ఈ స్టేజ్ కు వచ్చాను. రెస్పెక్ట్ ఇవ్వడం తెలుసుకో. అదేవిధంగా లింగ వివక్షను చూపించడం ఆపితే మంచిది’’ అని రిప్లై ఇచ్చింది.

కొంచెం కటువుగా, కొంచెం మృదువుగా సమాధానం ఇచ్చినప్పటికీ.. జెండర్ బేస్ చేసుకుని కామెంట్స్ చేస్తే ఆ స్థాయిలో ఉన్న ఎవరికైనా చిర్రెత్తుకురావడం సహజం. అయినా చాలా సంయమనంతో ఆ నెటిజన్ కు జ్ఞానోదయం కలిగేలా చేసింది ప్రీతి.