హైదరాబాద్, వెలుగు: కాంప్రహెన్సివ్పార్కింగ్పాలసీ తయారు చేసేందుకు అధికారులు విధివిధానాలు సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. బుధవారం బల్దియా హెడ్డాఫీసులో సిటీలోని పార్కింగ్ సమస్యపై చర్చించారు. అన్ని రకాల వెహికల్స్ ను పార్కింగ్చేసేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని చీఫ్ సిటీ ప్లానర్ ని ఆదేశించారు. ఇప్పటికే ఉన్నచోట నిర్వహణ లేక, జనం వినియోగించుకోవడం లేదని, అందరికీ అందుబాటులో ఉండేలా టూవీలర్స్, ఫోర్‌వీలర్స్ పార్కింగ్ కు స్థలాలు గుర్తించాలని సూచించారు. స్థలాల వివరాలు ప్రత్యేక పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా గుర్తించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ప్రైవేట్స్థలాలను ఇచ్చేందుకు ఎవరైనా ముందుకు వస్తే అందుకు తగిన నియమ నిబంధనలు తయారు చేయాలన్నారు. సమావేశంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, ఈఎన్సీ జియాఉద్దీన్, అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీశ్, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, ప్రాజెక్ట్సీఈ దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజేంద్రనగర్ కాటేదాన్ పరిధిలోని మార్షబాయి కుంట కబ్జా కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కొందరు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణ వ్యర్థాలు డంప్చేసినట్లు సమాచారం అందడంతో తొలగించామని చెప్పారు.
