అమెరికాలో వ్యాక్సిన్ వేసుకుంటే 7 వేలు

అమెరికాలో వ్యాక్సిన్ వేసుకుంటే 7 వేలు

వాషింగ్టన్: అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించడానికి బైడెన్ సర్కార్ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో సగం కంటే తక్కువ జనాభాకే వ్యాక్సినేషన్​ పూర్తయింది. మరోవైపు కేసులు పెరుగుతున్నయ్, ఇంకా కొంతమంది వ్యాక్సిన్​ తీసుకోవడానికి ముందుకు రావట్లేదు. దీంతో కరోనా టీకా వేసుకుంటే 100 డాలర్లు (సుమారు రూ.7,435) ఇవ్వాలని ప్రెసిడెంట్​ బైడెన్​ రాష్ట్రాలకు సూచించారు. ఇలా క్యాష్ రివార్డు ప్రకటించడం ద్వారా వ్యాక్సినేషన్​ రేట్​ పెరుగుతుందని సర్కారు భావిస్తోంది. దీనికోసం ముందుగా ఫెడరల్ వర్కర్ల ద్వారా ఆయా ప్రాంతాల్లోని వ్యాక్సినేషన్ స్టేటస్ ను తెలుసుకోవాలని నిర్ణయించింది. 100 డాలర్ల ఆఫర్ అందరినీ ఆకర్షిస్తుందని.. న్యూ మెక్సికో, ఒహియో, కొలరాడోలో కూడా అధికారులు ఇలాంటి ప్రయోగాలు చేశారని బైడెన్ అన్నారు.