తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రెండ్రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. రాష్ట్రపతి వెంట టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఏపీ మంత్రి రోజా తదితరులు ఉన్నారు. కాసేపట్లో రాష్ట్రపతి తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో భేటీ కానున్నారు. తిరుపతిలో కార్యక్రమాలు ముగిసిన తరువాత ఢిల్లీకి బయలుదేరుతారు. 

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 80 వేల మంది దర్శించుకున్నారు. స్వామివారిని 32,967 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 7లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.