సమాజ అభివృద్ధి అందరి బాధ్యత :ద్రౌపది ముర్ము

సమాజ అభివృద్ధి అందరి బాధ్యత :ద్రౌపది ముర్ము

సమాజ అభివృద్ధి అందరి బాధ్యత అని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశంలో ఆలయాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. తన పర్యటనలో శ్రీశైల మల్లన్నను భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నానని చెప్పారు. పిల్లలు దేశ భవిష్యత్ అని..చదువుపై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. తెలుగు నేర్చుకోవడానికి తనకు ఇంకా టైం పడుతుందన్నారు. భద్రాచల పర్యటనలో భాగంగా రాజమండ్రి నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్ లో భద్రాద్రి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..శ్రీ సీతారామచంద్ర మూర్తిని దర్శించుకున్నారు.  ప్రధాన ఆలయంలో స్వామివారికి ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. తొలిసారి భద్రాచలానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆలయ  అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్రపతికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ప్రసాద్‌  పథకం శిలాఫకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ తమిళిసై, మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్, సత్యవతి రాథోడ్‌ ఉన్నారు.

అనంతరం ద్రౌపది ముర్ము వనవాసీ కళ్యాణ పరిషత్‌ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన సమ్మక్క – సారలమ్మ జన్‌జాతి పూజారి సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సమ్మేళనం తర్వాత కుమురంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్‌ జిల్లాల్లో నిర్మించిన ఏకలవ్య గురుకుల పాఠశాలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి బయల్దేరుతారు.