హైదరాబాద్ సిటీ, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతకాల విడిది కోసం డిసెంబర్ 17న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లు, పారా-గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో-లైట్ ఎయిర్‌క్రాఫ్ట్ లను ఎగిరేయడాన్ని నిషేదించినట్టు సీపీ అవినావ్ మొహంతి తెలిపారు.
బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 17 , 22న, - గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 20న ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
