V6 News

డిసెంబర్ 17న హైదరాబాద్కు రాష్ట్రపతి ముర్ము

డిసెంబర్ 17న హైదరాబాద్కు  రాష్ట్రపతి ముర్ము

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం డిసెంబర్ 17న హైదరాబాద్ రానున్నారు. పర్యటనలో భాగంగా 22వరకు నగరంలోనే ఉండనున్న ఆమె.. 18న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. 

అనంతరం 19న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే కార్యక్రమంలో, 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 

21న.. అపాయింట్‌మెంట్ ఇచ్చిన పలువురు ప్రముఖులను కలుసుకున్న అనంతరం, 22న తన పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లీకి వెళ్తారు.