ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి సొంత రాష్ట్రంలో పర్యటన

ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి సొంత రాష్ట్రంలో పర్యటన

2 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ముర్ము

పూరీ: పూరీ జగన్నాథుడిని దర్శించుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 కిలోమీటర్లు నడిచివెళ్లారు. రోడ్డుకు రెండు వైపులా నిలబడిన వందలాది మంది భక్తులు రాష్ట్రపతిని విష్ చేశారు. వారికి అభివాదం చేస్తూ ముర్ము ముందుకు సాగారు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రెసిడెంట్ ట్విట్టర్​లో గురువారం పోస్ట్ చేశారు. ముర్ము వెంట కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అధికారులు నడిచి వెళ్లారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఒడిశాలోని భువనేశ్వర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్న ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గార్డ్ ఆఫ్ హానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రాష్ట్రపతి స్వీకరించారు. తర్వాత అక్కడి నుంచి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పూరీకి చేరుకున్నారు. జగన్నాథుడిని దర్శించుకున్న తర్వాత తిరిగి భువనేశ్వర్ చేరుకున్నారు. శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి తర్వాత తొలిసారిగా తన సొంత రాష్ట్రం ఒడిశాలో ఆమె పర్యటిస్తున్నారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో భువనేశ్వర్ పరిధిలోని ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం హాఫ్ డే సెలవు ప్రకటించింది