జూన్ 27న రాష్ట్రపతి ఎన్నికకు యశ్వంత్ సిన్హా నామినేషన్

జూన్ 27న రాష్ట్రపతి ఎన్నికకు యశ్వంత్ సిన్హా నామినేషన్

పలు చర్చల అనంతరం విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, టీఎంసీ మాజీ నేత యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో చర్చంచిన నేతలు ఈయన పేరును ఫైనల్ చేశారు. ఆ తర్వాత తమ ఉమ్మడి అభ్యర్థి   యశ్వంత్ సిన్హా అని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అధికారంగా ప్రకటించారు. కాగా జూన్ 27న ఉదయం 11.30గటలలకు యశ్వంత్ నామినేషన్ వేయనున్నట్టు శరద్ పవార్ వెల్లడించారు. ఇకపోతే విపక్షాల అభ్యర్థిగా ఇంతకుముందు పలువురి పేరు వార్తల్లోకి వచ్చినప్పటికీ.. నిన్న యశ్వంత్ టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగానే.. అభ్యర్థితత్వంపై ఓ క్లారిటీ వచ్చింది. తన రాజీనామా అంశాన్ని ప్రస్తావించిన యశ్వంత్...  దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందని  ట్వీట్‌ చేశారు. టీఎంసీలో మమతా బెనర్జీ తనకు ఇచ్చిన గౌరవం, హోదాకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసిన యశ్వంత్....  ప్రతిపక్షాల ఐక్యత కోసం పని చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.